ఎగ్ కార్ట్ కుర్రాడికి..ఫ్రీ ఫ్లాటు, ఫ్రీ ఎడ్యుకేషన్

ఎగ్ కార్ట్ కుర్రాడికి..ఫ్రీ ఫ్లాటు, ఫ్రీ ఎడ్యుకేషన్

ఇండోర్: తోపుడు బండిపై గుడ్లు అమ్ముకుంటున్న ఓ కుర్రాడు రూ. వంద లంచం ఇవ్వలేదంటూ మున్సిపల్ సిబ్బంది గుడ్లన్నీ నేలపాలు చేసిన ఘటనపై దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం పారాస్ రాయ్ క‌ర్ అనే 13 ఏళ్ల కుర్రాడు తోపుడు బండిపై గుడ్లు అమ్ముకుంటుండగా, మున్సిపల్ సిబ్బంది ఆ బండిని కింద పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ పిల్లాడి ఫ్యామిలీకి హెల్ప్ చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.

రాయ్ క‌ర్ మధ్యప్రదేశ్ మాజీ సీఎందిగ్విజయ్ సింగ్ రూ.10 వేలు ఇచ్చారు. అతడి పైచదువు లకూ సాయం చేస్తానన్నారు. ఆ పిల్లాడి ఫ్యామిలీకి పీఎం ఆవాస్ యోజన కింద ఫ్లాట్ ఇచ్చినట్లు లోకల్ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా చెప్పారు. ఒక సైకిల్, రూ.2,500 సాయం కూడా చేశారు. ఇండోర్ ప్రెస్ క్ల‌బ్.. రేషన్, కొంత డబ్బును అందజేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆఫీసుల నుంచి కూడా ఆ పిల్లాడికి ఫోన్లు వచ్చాయి.