వరల్డ్ ఎగ్ డే : ఎగ్.. వెజ్జా ? నాన్ వెజ్జా ?

వరల్డ్ ఎగ్ డే : ఎగ్.. వెజ్జా ? నాన్ వెజ్జా ?

నాన్ వెజ్ అస్సలు ముట్టని వాళ్లు..గుడ్డు కూడా ముట్టరు. గుడ్డు కూడా నాన్ వెజ్ కిందే లెక్క కడతారు. అయితే ఈ మధ్య కాలంలో గుడ్డుని వెజిటేరియన్ ఫుడ్ కింద కన్సి డర్ చేయాలని చాలామంది వాదిస్తున్నారు. అసలు గుడ్డు గురించి ఎందుకింత చర్చ. ఇప్పటిదాకా నాన్ వెజ్
లాగానే చూసిన గుడ్డుని వెజ్‌‌లోకి ఎందుకు మార్చాలి. ఎగ్‌ టేరియన్లు ఏమంటున్నారో చూద్దాం.

గుడ్డు వెజ్జా ? నాన్ వెజ్జా ? అనే విషయం కొంత మంది ఎగ్‌ టేరియన్స్‌‌ని అడిగితే ఇలా చెప్పారు. ‘‘గుడ్డు వెజిటేరియన్ అని, నాన్‌‌వెజ్ కాదని.. మేము చెప్పడం కాదు, సైంటిస్టులే చెప్తున్నారు. చాలామంది మాంసాహారం ముట్టని వాళ్లు, పూర్తి శాకాహారులు గుడ్డుని నాన్ వెజ్‌‌లా
భావించి, తినడం మానేస్తారు. గుడ్డు కోడి నుంచి వస్తుంది కాబట్టి అది కూడా మాంసాహారమే అనుకుంటారు. మరి అలా అయితే గేదె నుంచి వచ్చే పాలు కూడా మాంసాహారమే కదా? పాల లాగానే గుడ్డుకూడా జంతువుల బై ప్రొడక్టే..అయితే అందులో మాంసం, జీవం ఉండదు. ప్రూఫ్స్‌‌తో
సహా గుడ్డు మాంసాహారం కాదని సైంటిస్టులు తేల్చేశారు. అందుకే గుడ్డుని వెజ్ కింద భావించొచ్చు. వెజ్ తినే వాళ్లందరూ గుడ్డును కూడా తిని ఆరోగ్యంగా ఉండొచ్చు’’అని చెప్పింది అనూష.

తప్పేమీలేదు

‘‘వెజిటేరియన్స్ గుడ్డు తింటే వచ్చే నష్టమేమీ లేదు. ‘కోడి నుంచి వస్తుంది’ అనే తప్ప ‘కోడిని చంపుతున్నామనే సమస్య గుడ్డులో లేదు. ఒకవేళ
కొద్దిపాటి జీవం ఉన్నా తినడంలో తప్పేమీలేదు. ఎందుకంటే బ్యాక్టీరియా చచ్చిపోతుందని గాలి పీల్చకుండా ఉండలేం కదా! ఇది కూడా అంతే.. గుడ్డు ఈ భూమ్మీద అన్నింటికంటే హెల్దీ ఫుడ్. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ గుడ్డు తినొచ్చు’’ –పల్లవి, హైదరాబాద్

నాటుకోడి వేరు
‘‘గుడ్డు నాన్ వెజ్ కాదు. ఎందుకంటే..గుడ్లలో రెండు రకాలున్నాయి. మనం ఊళ్లలో చూసే నాటు కోడి గుడ్లు వేరు, సిటీలో దొరికే ఫారం గుడ్లు వేరు. నాటు కోడి గుడ్లు పొదిగి పిల్లల్ని కంటాయి. వాటిలో ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే వాటిలో కొద్దో, గొప్పో జీవం ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కె ట్‌ లో దొరికేవి అన్‌‌ఫెర్టిలైజర్ ఎగ్స్ . అంటే.. వాటిలో ఎలాంటి జీవం ఉండదు. కాబట్టి అది వెజిటేరియన్ ఫుడ్ కిందకే చెప్పుకోవచ్చు’’ –అభిరామ్,హైదరాబాద్

సైంటిఫికల్లీ వెజ్..

గుడ్డు వెజ్జా , నాన్ వెజ్జా అనే అంశం మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని తేల్చారు. గుడ్డులో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. పెంకు, తెల్ల సొన, పచ్చ సొన. ఇందులో పెంకు తినడానికి పనికిరాదు. ఇక తెల్ల సొనలో ఎలాంటి యానిమల్ సెల్స్ ఉండవు. అందులో కేవలం
ప్రొటీన్సే ఉంటాయి. సైంటిఫిక్‌ గా కూడా తెల్ల సొన శాకాహారమే. ఇకపోతే.. పచ్చ సొన. ఇందులో కూడా ప్రొటీన్లు, కొలెస్ట్రాల్‌‌, కొవ్వులు ఉంటాయి తప్ప జీవం ఉండదు. మనం తినే ఫారం కోడి గుడ్లలో ఫెర్టిలైజ్ అయ్యే పిండాలు లాంటివి ఉండవు. అందుకే పచ్చ సొన కూడా సైంటిఫిక్‌ గా నాన్ వెజ్ కిందకు రాదు. ఫారంలో తయారు చేసే గుడ్లన్నీ కేవలం తినడానికే తయారు చేస్తారు. ఆ గుడ్డును తినకుండా ఉంచినా, దాని నుంచి కోడిపిల్ల
బయటకు వచ్చే అవకాశాలు లేవు. అందుకే గుడ్డుని వెజ్ కింద భావించి తినేయొచ్చు.

ఎంతో మంచిది

గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే గుడ్డుని ‘నేచర్‌‌ మల్టీవిటమిన్‌‌’ అంటారు. అంటే ప్రకృతి ఇచ్చిన మల్టీ విటమిన్ ఫుడ్. ఇందులో
యాంటీ ఆక్సి డెంట్స్‌‌, బ్రెయిన్‌‌ న్యూట్రియెంట్స్‌‌ ఉంటాయి. అలాగే గుడ్డులో విటమిన్-ఎ,బి, డి,ఇ, కె ఇలా అన్ని విటమిన్లు ఉంటాయి. వాటితో
పాటు శరీర పోషణకు కావాల్సిన ఖనిజాలు,లవణాలు, కార్బొహైడ్రేట్లు , కొవ్వుపదార్థాలు కూడా ఉంటాయి. గుడ్డులో ఉన్నన్ని మల్టీ
పోషకాలు మరే పదార్థం లోనూ ఉండవు. మరో విషయమేంటంటే.. విటమిన్–-డి ఉదయం ఎండలో మాత్రమే లభిస్తుందనుకుంటారు
చాలామంది. కానీ విటమిన్ డి పుష్కలంగా లభించే పదార్థాల్లో గుడ్డులోని పచ్చసొన కూడా ఒకటి. అని సైంటిస్టులు సూచిస్తున్నారు.

ఎన్నో స్టైల్స్ 

ఫ్లెక్సి బిలిటీని బట్టి హెల్త్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడంలో తప్పులేదంటున్నారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో చాలా కొత్త
హెల్త్ స్టైల్స్ వచ్చాయి. వెజ్ తినే వాళ్లలో వెజిటేరియన్స్, వీగన్స్, ఎగ్‌ టేరియన్స్ లాగానే నాన్ వెజ్ తినే వాళ్లలో కూడా గ్రేవిటేరియన్స్,
బూజిటేరియన్స్, ఫోర్స్‌‌టేరియన్స్ ఉంటారు. గ్రేవిటేరియన్స్ అంటే చికెన్ గ్రేవీ తింటారు తప్ప చికెన్ ముక్కలు తినరు. బూజిటేరియన్స్
పార్టీలప్పుడు మాత్రమే నాన్ వెజ్ తింటారు. ఇక ఫోర్స్‌‌టేరియన్స్ ఎవరైనా ఫోర్స్ చేస్తేనే చికెన్ తింటారు. ఇలా ఎవరి ఫ్లెక్సి బిలిటీని
బట్టి వాళ్లు ఫుడ్ హ్యాబిట్స్‌‌ని మార్చుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ఫుడ్ సూట్ అవుతుందో డాక్టర్లను సంప్రదించి డెసిషన్ తీసుకోవాలి. పోషకాల లోపం ఉన్నవాళ్లు పోషకాల కోసం కచ్చితంగా గుడ్డుని తినాల్సి ఉంటుంది. అందుకే వెజ్, నాన్ వెజ్ అనే కన్ఫ్యూజన్‌‌తో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా.. పెద్దగా పట్టింపులేమీ లేని వాళ్లు హాయిగా గుడ్డుని తినేయొచ్చు.  ఏదేమైనా.. ‘కోడి ముందా? గుడ్డుముందా?’ అంటే చెప్పలేం కానీ,
ఆరోగ్యానికి కోడి మంచిదా? గుడ్డు మంచిదా? అంటే గుడ్డే మంచిది అని చెప్పేయొచ్చు. డాక్టర్లు కూడా గుడ్డు ‘వెజ్’ అని, ఎలాంటి సందేహం లేకుండా అందరూ తినొచ్చని చెప్తున్నారు. కాబట్టి గుడ్డుని రెగ్యులర్ డైట్‌ లో కలిపేయాలనుకుంటే…ఈ ఎగ్ డేనే మంచి సందర్భం.- నాగ తిలక్

చంపట్లేదు కదా
నేను ప్యూర్ వెజిటేరియన్‌‌ని మాంసం అస్సలు తినను. కానీ గుడ్డు తింటా. ఎందుకంటే… ఒక జీవిని చంపి తినడం మానవత్వం అనిపించుకోదు. ఒక జీవిని చంపి తినే హక్కుకూడా మనకు లేదు. అందుకే నేను మాంసం తినను. గుడ్డు ఎందుకు తింటానంటే.. గుడ్లు కోళ్ల నుంచే వచ్చినా.. మనం తినే గుడ్ల నుంచి మాత్రం కోళ్లు రావు. అయినా కోడిని చంపి గుడ్డును తీసుకోవట్లేదు. అందుకే గుడ్డు వెజ్ లానే తినేయొచ్చు. అయినా జంతువు నుంచి వచ్చే ప్రతీది మాంసాహారం కాదు. పాలే దానికి ఉదాహరణ – ఆకాంక్ష,హైదరాబాద్

అమెరికన్‌‌ షెఫ్‌ హోవర్డ్‌‌ హెల్మర్‌ కి ‘ఆమ్లెట్‌ కింగ్‌ ’ అనే పేరుంది. ఆమ్లెట్‌ మేకింగ్‌ లో మూడు గిన్నిస్‌ రికార్డులు అతని సొంతం అయ్యాయి. వాటిల్లో అరగంటలో 427 డబుల్ ఎగ్‌ ఆమ్లెట్లు వేయడం మెమరబుల్‌‌.