
క్రూర మృగాలను పెంచుకోవడం ఈ మధ్య ఫ్యాషనైపోయింది. అదొక స్టేటస్ సింబల్ లా మారిపోయింది. పెంపుడు జంతువులంటే కుక్క, పిల్లి, కుందేలు.. ఇలా హాని చేయని వాటిని పెంచుకునేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే.. సింహాలు, పులులు, అనకొండలను పెంచుకోవడం. చాలా దేశాల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. అలా పెంచుకున్న ఒక సింహం పిల్ల యజమాని నుంచి తప్పించుకుని జనాలకు చుక్కలు చూపించింది. అది చేసిన దాడికి ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ లాహోర్ లో జరిగింది ఈ ఘటన. జనాలను వెంటాడి గాయపరిచిన వీడియోను లాహోర్ పోలీసులు శుక్రవారం (జులై 4) విడుదల చేశారు. గురువారం ఇంటి ఆవరణలో యజమానితో ఆడుకుంటున్న చిన్న సింహం.. గోడ దూకి ఒక్కసారిగా వెంటపడటంతో జనాలు పరుగులు తీశారు. కిరాణ సామాను తీసుకెళ్తున్న మహిళ వీపుపై పంజా విసిరి కింద పడేసింది. దీంతో ఆ మహిళ గాయపడినట్లు పోలీసులు చెప్పారు.
ALSO READ | బెంగళూరులో మరో ఘోరం: ఏకంగా చుట్టాల ఇంటికే నిప్పు.. ట్విస్ట్ ఏంటంటే..
అంతే కాకుండా ఇద్దరు చిన్నారులపై దాడి చేయడంతో వాళ్లూ గాయపడ్డారు. తన ఐదేళ్ల కూతురి ముఖం.. ఏడేళ్ల కూతురు చేతులకు తీవ్ర గాయాలయ్యాయని వాళ్ల తండ్రి కంప్లైట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. అయితే వారికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని తెలిపారు.
సింహం దాడి చేసిందని తెలిసి ఓనర్స్ ఇంటి నుంచి పారిపోయారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. సింహాన్ని పెంచుకున్న ముగ్గురు ఓనర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 11 నెలల మగ సింహం పిల్లను విల్డ్ లైఫ్ పార్క్ కు తరలించినట్లు చెప్పారు. క్రూర జంతువులను పెంచుకునే వారు లైసెన్స్ తీసుకోవాలని.. ఎవరికైనా ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సిందిగా చెప్పారు.
Pet lion escaped from owner and attacked woman and children pic.twitter.com/hTGmrZkkuL
— Mahadev Narumalla✍ (@Kurmimahadev) July 4, 2025