బెంగళూరులో మరో ఘోరం: ఏకంగా చుట్టాల ఇంటికే నిప్పు.. ట్విస్ట్ ఏంటంటే..

బెంగళూరులో మరో ఘోరం: ఏకంగా చుట్టాల ఇంటికే నిప్పు.. ట్విస్ట్ ఏంటంటే..

టెక్ రంగానికి ప్రసిద్ధి చెందిన బెంగుళూరులో రోజుకో ఘటన ఈ రోజుల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే నిన్న మొన్నటిదాక పలు రకాల ఘటనలు చోటు చేసుకుంటే నేడు మరో కొత్త ఘటన వారతాల్లోకి ఎక్కింది. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. 

వివరాలు చూస్తే  గత మంగళవారం బెంగుళూరులోని వివేక్ నగర్‌లో డబ్బుల వివాదం కారణంగా ఓ 45 ఏళ్ల వ్యక్తి తన బంధువుల ఇంటికి నిప్పంటించాడు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ బాధితుడి ఇల్లు దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపగా,  నిందితుడిని వివేక్ నగర్‌లోని ఎజిపురాలో ఉంటున్న  సుబ్రమణిగా  పోలీసులు గుర్తించారు.

 వివేక్ నగర్లోని  41 ఏళ్ల  సతీష్ కుమార్  దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, జూలై 1న సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సతీష్ తల్లి వెంకటరమణి, ఆమె సోదరుడు మోహన్‌దాస్, విజయ్ కుమార్, రవికుమార్‌లతో కలిసి మూడు అంతస్తుల భవనంలో ఉంటున్నారు. సతీష్ కుమార్ గత తొమ్మిది నెలలుగా వైట్‌ఫీల్డ్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ ట్రైనింగ్ అండ్  ఇన్‌స్పెక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 

ALSO READ : వైసీపీ బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఎనిమిది సంవత్సరాల క్రితం తన సోదరుడి కూతురు పార్వతి తన కుమార్తె మహాలక్ష్మి పెళ్లీ  కోసం తన తల్లి వెంకటరమణి నుండి రూ. 5 లక్షల అప్పు తీసుకున్నట్లు సతీష్ చెప్పాడు. వెంకటరమణి పార్వతిని అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని అడగగా పార్వతి ఇంకా ఆమె కూతురు మహాలక్ష్మి ఇద్దరు కలిసి కోపంగా ఆమెని వేధించారు. జూన్ 30న సాయంత్రం మహాలక్ష్మి సతీష్‌కు ఫోన్ చేసి మీ తల్లి, మీ సోదరుడు రవి డబ్బు తిరిగి ఇవ్వమని పదే పదే అడుగుతున్నారు అని చెప్పింది.

అలాగే ఆమె సతీష్‌కి డబ్బు ఇక అడగవద్దని చెప్పు, లేదంటే  తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించింది. బెదిరింపుల తర్వాత సతీష్ సహా ఇతరులు కలిసి రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పార్వతి ఇంటికి వెళ్లారు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే ముందు ఈ విషయాన్ని చర్చించుకోవాలని కోరారు. 

కానీ జూలై 1న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సతీష్ తల్లి అతనికి ఫోన్ చేసి  సోదరుడు పడుకున్నప్పుడు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎవరో నిప్పంటించారని సమాచారం ఇచ్చింది. మంటలను చూసిన చుట్టుపక్కల వారు  వాటిని  ఆర్పారు. కానీ ఇంటి ముందు ఉన్న షూ రాక్, కిటికీ సహా డోర్లు అప్పటికే మంటల్లో కాలిపోయాయి. ఇంటికి తిరిగి వచ్చిన సతీష్ CCTV ఫుటేజ్‌ చెక్ చేయగా సుబ్రమణి వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించడని తెలుసుకున్నాడు. దింతో సుబ్రమణి తన తల్లిని అలాగే  సోదరుడిని చంపడానికి ప్రయత్నించాడని సతీష్ ఆరోపించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.