
ప్రతిపక్ష వైసీపీ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. వైసీపీ భయభ్రాంతులు తట్టుకునే ఈ స్థాయికి వచ్చామని అన్నారు పవన్ కళ్యాణ్. 2029లో మళ్ళీ వస్తే అంతు చూస్తామని అంటున్నారని.. అంతు చూడాలంటే మీరు రావాలి కదా.. ఎలా వస్తారో మేమూ చూస్తామంటూ చురకలంటించారు పవన్. గత వైసిపి ప్రభుత్వం ఏం చేసింది,ఎలా ప్రవర్తించింది అందరికీ తెలుసని.. వైసిపి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా వెలుగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు.
వైసీపీ మీద వ్యక్తి గతంగా తనకు ఎలాంటి కక్ష లేదని అన్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులను తట్టుకొనే ఈస్థాయికి వచ్చామని.. వైసిపి బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. వైసిపి మంచి పాలన అందిస్తే 11సీట్లు వచ్చేవి కాదు కదా అని ఎద్దేవా చేశారు పవన్. ఇది తప్పు చేస్తే శిక్షించే ప్రభూత్వమని.. ప్రభుత్వం తప్పు చేస్తే చెప్పండి వింటాం.. అంతే కానీ, వైసీపీ తాటాకు చప్పుళ్లకు బయపడమని అన్నారు పవన్.
ALSO READ : పార్టీ పదవులతోనే గుర్తింపు, గౌరవం.. 2029 ఎన్నికలు కొత్త నాయకత్వానికి వేదిక అవ్వాలి: సీఎం రేవంత్
వైసీపీ ప్రభుత్వంలో 4వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని.. కూటమి ప్రభుత్వం కృషి, కేంద్ర సహకారంతో ప్రకాశం జిల్లాలో తీగునీటి పథకం ఏర్పాటయ్యిందని అన్నారు పవన్. గత వైసిపి ప్రభుత్వం త్రాగునీరు ప్రాజెక్ట్ లను అటకెక్కించిందని.. కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక బద్దంగా ముందుకెళుతుందని అన్నారు. 18 నుంచి 20 నెలలోపు ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని.. వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని అన్నారు పవన్ కళ్యాణ్.