
జనాలు బిజీ బిజీగా గడుపుతున్నారు. పిల్లలకు హాలిడే వచ్చినా కొంతమంది పేరంట్స్ కు ఇంట్లో ఉండేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వివిధ రకాల ఉద్యోగులు.. పనివేళలు అలా ఉంటాయి. ప్రస్తుతం ఓ మాదిరి కన్నా తక్కువ స్థాయిలోనే లైఫ్ గడపాలంటే.. భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పని. మరి అలాంటప్పుడు హాలిడే రోజు పిల్లలను ఇంట్లో వదిలి పెట్టాలంటే పేరెంట్స్ ఆందోళనకు గురవుతారు. కాని వదిలి పెట్టి వెళ్లక తప్పదు. మరి ఎలాంటి లక్షణాలున్న పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలేసి పోవడం కొందరు పేరెంట్స్‌కు ఆందోళన కలిగించే విషయం. భయపడకుండా ఇంట్లోవాళ్లు ఎట్లా ఉంటారో? అనే కంగారు తల్లిదండ్రులకు ఎక్కువ ఉంటుంది. అయితే పిల్లల్లో కొన్ని లక్షణాలు గమనించిన తర్వాత వాళ్లను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లొచ్చని చెప్తున్నారు మానసిక నిపుణులు.
ALSO READ : బ్రౌన్ రైస్ Vs వైట్ రైస్
పిల్లలు ఫిజికల్ , మెంటల్‌గా తమకు తాము కేర్ తీసుకోగలిగినప్పుడు...మీ మాట వినడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు...ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు..ఒత్తిడితో కూడిన సందర్భాల్లో పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది గమనించాలి.
ఒక్కరే ఉండగలిగే ధైర్యం, అలా ఉన్నప్పుడు కంఫర్ట్ ఫీలవుతున్నారా? అనే విషయాలను గమనించిన తర్వాతే పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు వాళ్లకు కావాల్సింది... వాళ్లంతట వాళ్లు వండుకోగలరా..? ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇంట్లో సేఫ్ గా ఉంటారా?... ఒకవేళ చిన్నపిల్లల్ని వదిలివెళ్తే.. వాళ్లని చూసుకోగలిగే సీన్ ఉందా? ...చుట్టుపక్కల ఎలాంటి వాళ్లు ఉన్నారు?... ఈ విషయాల్ని కూడా గమనించాలని అంటున్నారు.
మీకు తెలుసా?
అమెరికాలాంటి కొన్ని దేశాల్లో పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లడానికి కూడా ఏజ్ లిమిట్‌తో కూడిన చట్టం ఉంది. దానిని బ్రేక్ చేస్తే అది నేరం అవుతుంది కూడా.యూఎస్ చిల్డ్రన్స్ బ్యూరో ప్రకారం.. మేరీల్యాండ్ లో ఎనిమిదేళ్లు, ఓరెగాన్ లో పదేళ్లు, ఇల్లినాయిస్లో పద్నాలుగు ఏళ్ల లోపు వయసున్న పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లకూడదు.ఇలా వెళ్తే ఆ పేరెంట్స్‌పై పోలీసులకు ఫిర్యాదు. చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది