ఐషర్​ మోటార్స్ లాభం.. రూ.1,362 కోట్లు

ఐషర్​ మోటార్స్ లాభం.. రూ.1,362 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరం మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్లో ఐషర్​ మోటార్స్ నికరలాభం 27 శాతం పెరిగి రూ.1,362 కోట్లకు చేరుకుంది. 2023–-24 ఆర్థిక సంవత్సరం జనవరి–-మార్చి కాలానికి కంపెనీ రూ.1,070 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ.4,256 కోట్ల నుంచి రూ.5,241 కోట్లకు పెరిగిందని ఐషర్​ మోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. 

2025 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.4,734 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 18 శాతం ఎక్కువ. ఆదాయం రూ.16,536 కోట్ల నుంచి రూ.18,870 కోట్లకు పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.70 తుది డివిడెండ్‌‌‌‌ను బోర్డు ఆమోదించింది. బుధవారం బీఎస్‌‌‌‌ఈలో ఐషర్ మోటార్స్ షేర్లు 0.56 శాతం పెరిగి రూ.5,451 వద్ద ముగిశాయి.