బక్రీద్ వేళ స్వీట్లు పంచుకోని ఇండో-పాక్

బక్రీద్ వేళ స్వీట్లు పంచుకోని ఇండో-పాక్

బక్రీద్ పర్వదినం రోజున పంజాబ్ లోని వాఘా- అటారీ  దేశ సరిహాద్దు దగ్గర బీఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రేంజర్లు తమ తమ దేశాల జెండాలను ప్రదర్శించారు. ఏదైనా పర్వదినం రోజున ఇరు దేశ సైనికులు జెండాలను ప్రదర్శించి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. అయితే బక్రీద్ నాడు మాత్రం రెండు దేశాల  సైనికులు మధ్య ఎలాంటి మాటల్లేవ్. స్వీట్స్ ను కూడా పంచుకోలేదు. వాస్తవానికి బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుదామనుకున్నా పాకిస్తాన్ రేంజర్లు అందుకు ఒప్పుకోలేదని తెలిసింది.  బక్రీద్ నాడు మిఠాయిల పంపిణీ వద్దని పాక్ ఆదివారమే బీఎస్ఎఫ్ కు తెలిపినట్టు సమాచారం.

ఈ ఏడాది జూన్ లో మాత్రం రంజాన్ సందర్భంగా ఇరు దేశ సైనికులు స్వీట్స్ పంచుకున్నారు.