పెరిగిన రిలయన్స్ పవర్‌‌‌‌‌‌‌‌ నష్టం‌‌‌‌‌‌‌‌

పెరిగిన రిలయన్స్ పవర్‌‌‌‌‌‌‌‌ నష్టం‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : రి లయన్స్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో రూ.397.66 కోట్ల  నష్టం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) వచ్చింది. ఫ్యూయల్ ఖర్చులు పెరగడంతో కంపెనీ నష్టం పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.321.79 కోట్ల లాభాన్ని రిలయన్స్ పవర్  ప్రకటించింది.  మొత్తం ఆదాయం  ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం రూ.1,853.32 కోట్ల నుంచి రూ.2,193 కోట్లకు చేరుకుంది. క్యూ4లో కంపెనీ చేసిన ఖర్చుల్లో రూ.953.67 కోట్లు ఫ్యూయల్ ఖర్చులు ఉన్నాయి.

2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రిలయన్స్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.2,068.38 కోట్ల నష్టం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.470.77 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా పెరిగింది. ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్‌‌‌‌‌‌‌‌ బాండ్లను ఇష్యూ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, రిలయన్స్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌కు ‌‌‌‌‌‌‌‌ 6 వేల మెగా వాట్ల  విలువైన పవర్ జనరేషన్  అసెట్స్ ఉన్నాయి.