నా కథ కాపీ కొట్టి .. బేబి సినిమా తీశారు : శిరిన్ శ్రీరామ్

నా కథ కాపీ కొట్టి ..  బేబి సినిమా  తీశారు : శిరిన్ శ్రీరామ్

అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో శిరిన్ శ్రీరామ్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. జూన్ 7న  సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. దర్శకుడు శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘ఓ బస్తీ అమ్మాయి, ఇద్దరబ్బాయిలు కాన్సెప్ట్‌‌‌‌తో  కథ రాసుకున్నా. దర్శకుడిగా అవకాశం ఇస్తూ, సినిమా నిర్మిస్తానన్న సాయి రాజేష్‌‌‌‌.. నేను ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు రాగానే అదే కథను ‘బేబి’ సినిమాగా తీశాడు. సాక్ష్యాలు అన్నీ సంపాదించి కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ ఆయనే నాకు ఆ కథను చెప్పాడని రిప్లై ఇచ్చాడు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. దాంతో నాపై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌‌‌‌లో ఫిర్యాదులు చేశాడు. అందుకే ఇలా మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాలను బుక్ రూపంలో తీసుకొస్తున్నా’ అని చెప్పాడు.