
నువ్వే కావాలి, మన్మథుడు లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో మెప్పించిన విజయ్ భాస్కర్.. తన కొడుకు శ్రీకమల్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉషా పరిణయం’. తాన్వీ ఆకాంక్ష హీరోయిన్. శనివారం ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ‘ప్రేమకు నిర్వచనం లాంటి సినిమా ఇది. అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా లవర్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. నేను అనుకున్న పాత్రకు కమల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. మళ్లీ ఓ మంచి సినిమాను తీశానని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను’ అన్నారు. అన్ని ఏజ్ గ్రూప్‌లకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని, టీజర్ తరహాలోనే సినిమా కూడా అందరికీ నచ్చుతుందని హీరోహీరోయిన్స్ చెప్పారు. నటులు సూర్య, రవి, శివతేజ, సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ తదితరులు పాల్గొన్నారు.