యూఎస్‌‌‌‌‌‌‌‌కు టీమిండియా

యూఎస్‌‌‌‌‌‌‌‌కు టీమిండియా

ముంబై: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం టీమిండియా శనివారం అమెరికాకు బయలుదేరింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌, బుమ్రా, జడేజా, గిల్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, శివం దూబేతో కూడిన తొలి బ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌లో న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కింది.  అయితే ఇందులో స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ లేకపోవడం గమనార్హం. 

ఈ టోర్నీకి సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్లేయర్లలో  ఎవరూ కూడా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఆడటం లేదు. దీంతో టీమ్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఒకేసారి అమెరికాకు బయలుదేరుతుందని భావించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం  రెండో బ్యాచ్‌‌‌‌‌‌‌‌ వెళ్తుంది. ఇందులో జైస్వాల్‌‌‌‌‌‌‌‌, శాంసన్‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌తో పాటు రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఆవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, ఖలీల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ ఉండనున్నారు. వీళ్లతో పాటుగా కోహ్లీ న్యూయార్క్ చేరుకోనున్నాడు.