ఒలింపిక్స్‌ బరిలో 8 మంది కొత్త ప్లేయర్లు

ఒలింపిక్స్‌ బరిలో 8 మంది కొత్త ప్లేయర్లు
  • 16 మందితో విమెన్స్‌‌ హాకీ టీమ్‌‌ ఎంపిక

బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్‌‌లో ఇండియా విమెన్స్‌‌ హాకీ టీమ్‌‌ను గురువారం ప్రకటించారు. రాణి రాంపాల్‌‌ కెప్టెన్సీలో16 మందితో కూడిన టీమ్‌‌లో ఎనిమిది తొలిసారి ఒలింపిక్స్‌‌ బరిలో నిలిచారు. గత ఒలింపిక్స్‌‌లో ఆడిన వాళ్లలో ఎనిమిది మందికి మళ్లీ చాన్స్‌‌ ఇచ్చారు.  డ్రాగ్‌‌ ఫ్లికర్‌‌ గుర్జిత్‌‌ కౌర్‌‌, ఉదితా, నిషా, నేహ, నవనీత్‌‌ కౌర్‌‌, షర్మిలా దేవి, లాల్‌‌రెమ్‌‌సియావితో పాటు మిజోరం నుంచి టీమ్‌‌లోకి వచ్చిన తొలి ప్లేయర్‌‌ సలీమా టెటె ఒలింపిక్‌‌ డెబ్యూ చేయనున్నారు. 

ఇండియా టీమ్‌‌: డిఫెండర్స్‌‌: దీప్‌‌ గ్రేస్‌‌, నిక్కి ప్రధాన్‌‌, గుర్జిత్‌‌ కౌర్‌‌, ఉదితా; మిడ్‌‌ఫీల్డర్స్‌‌: నిషా, నేహ, సుశీల చాను, మోనికా, నవజోత్‌‌, సలీమా; ఫార్వర్డ్స్‌‌: రాణి రాంపాల్‌‌, నవనీత్‌‌ కౌర్‌‌, లాల్‌‌రెమ్‌‌సియామి, వందనా కటారియా, షర్మిలా దేవి; గోల్‌‌కీపర్‌‌: సవిత.