
జైపూర్, వెలుగు: చదువు ఇష్టం లేక ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో వేలాల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది.
జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దామరకుంట శ్రావణి, రవి దంపతుల చిన్నకూతురు లక్ష్మీ ప్రసన్న (13) మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి పంటి, చెవి నొప్పితో బాధపడుతుండడంతో లక్ష్మీప్రసన్నను ఇంటికి తీసుకొచ్చిన ఆమె తండ్రి మంచిర్యాల హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ చేయించాడు.
అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో పాటు చదువు మీద ఇష్టం లేకపోవడంతో ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.