పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించారు. మార్చి 19న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అప్‌డేట్ ఇస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాస్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు.
బ్యాక్‌గ్రౌండ్‌లో భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని వినిపిస్తూ.. ‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపుతుంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో పార్తిబన్, కె యస్ రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కె జి ఎఫ్ అవినాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేయగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అందించాడు.
