శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన చిత్రం ‘మృత్యుంజయ్’. మార్చి 6న విడుదలైన సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘కేవలం కంటెంట్‌తోనే తీసిన సినిమా ఇది. ఆడియెన్స్ చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవుతున్నారు.
హుస్సేన్ రైటింగ్, ట్విస్ట్‌లు బాగా వర్కవుట్ అయ్యాయి. తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్‌లో ఇదొకటి. సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ.. ‘సినిమాలో పాటలు, కామెడీ సీన్లు లేవు. కంటెంట్‌తోనే ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ రివ్యూస్ చూసి చాలా ఆనందమేసింది.
ఆడియెన్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు. సందీప్ గుణ్ణం మాట్లాడుతూ.. ‘రివ్యూలు, ఆడియెన్స్ మౌత్ టాక్ బాగా కలిసి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా ఉన్నారు. నాకు అదే చాలా పెద్ద సక్సెస్’ అని చెప్పారు. ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకి మంచి పేరు రావడం సంతోషాన్ని ఇస్తోందని మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ అన్నాడు.
