కరీంనగర్ సిటీలోని రజీనీ ఫెర్టిలిటీ సెంటర్ లో 14 జంటలకు ఉచితంగా ఐవీఎఫ్

కరీంనగర్ సిటీలోని రజీనీ ఫెర్టిలిటీ సెంటర్ లో 14 జంటలకు ఉచితంగా ఐవీఎఫ్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సిటీలోని రజీనీ ఫెర్టిలిటీ సెంటర్ లో 14మంది దంపతులకు ఉచితంగా ఐవీఎఫ్​ చికిత్స అందిస్తున్నట్లు రెనే  హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బంగారుస్వామి, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్ పర్సన్ డాక్టర్ రజనీ ప్రియదర్శిని తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోక్ డ్యాన్సర్, సింగర్ నాగదుర్గ, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీలతో కలిసి లక్కీడిప్  ద్వారా 10 జంటలను ఎంపిక చేశారు. దీంతోపాటు బంగారిస్వామి అన్న పెద్దపల్లి రంజన్, మీనా దంపతులు మరో మూడు జంటలకు సైతం ఉచితంగా ఐవీఎఫ్​ చికిత్స అందచేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నాగదుర్గ మాట్లాడుతూ...  ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, ప్రతి మహిళా శక్తి వెనుక పురుషుడి తోడ్పాటు ఉంటుందన్నారు. రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ తమ అత్త పేరిట ప్రతి ఏటా రూ.20 లక్షల విలువైన సంతాన సాఫల్య ఉచిత సేవలు అందించడం సంతృప్తినిస్తుందన్నారు. బంగారి స్వామి మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చిన సమాజానికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు.