విశాల్ మొగుడు సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్

విశాల్ మొగుడు సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్

విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘మొగుడు’. తమన్నా హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ కలిసి నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ పూర్తయిందని, నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను కోల్‌‌‌‌‌‌‌‌కతా, గోవా, చెన్నైలో ప్లాన్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన  టైటిల్  ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  

ఓ సాధారణ మొగుడిలా ఇంట్లో అన్ని పనులు చేస్తూనే.. అండర్ కవర్ పోలీస్‌‌‌‌‌‌‌‌లా రౌడీలను కొట్టే వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది. నవదీప్,  వీటీవీ గణేష్, యోగి బాబు, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిప్‌‌‌‌‌‌‌‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. విశాల్, సుందర్ సి కాంబోలో  ఆంబళ, మద గద రాజా చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.