ఐపీఎల్ లో  కొత్త  యువకులను తీసుకోండి

ఐపీఎల్ లో  కొత్త  యువకులను తీసుకోండి

ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో పాక్, న్యూజిలాండ్ ల చేతుల్లో టీమిండియా ఓడిపోయింది. దీంతో టీమిండియాపై విమ‌ర్శ‌లు వస్తున్న సమయంలో  భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. బాగా ఆడే సీనియ‌ర్‌లు రాణించ‌క‌పోతే, తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. టీమ్‌లో ఎవ‌రినైనా ప‌క్క‌న పెట్టేయాల‌న్న ఆలోచన‌ వ‌స్తే ముందుగా.. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌నే తీసేయాల‌ని, వారి స్థానంలో కొత్త కుర్రాళ్ల‌ను ఆడించాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఐపీఎల్ లో బాగా  రాణిస్తోన్న వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని చెప్పారు కపిల్ దేవ్. క్రికెట్‌లో త‌ర్వాతి త‌రాన్ని ఎలా మెరుగ్గా తీర్చిదిద్దాల‌న్న విష‌యంపై సెలెక్ట‌ర్లు ఆలోచించాల‌ని ఆయ‌న సూచించారు. ఒక‌వేళ కొత్తవారు ఓడిపోయిన‌ప్ప‌టికీ న‌ష్ట‌మేమీ ఉండబోద‌ని, ఎందుకంటే వారికి అనుభ‌వం వ‌స్తుంద‌ని చెప్పారు. దీనిపై బీసీసీఐ  నిర్ణయం తీసుకోవాలని .. కొత్త వారిని తీసుకోవాల‌ని  సూచించారు కపిల్.