
-
కరీంనగర్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం
-
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎంపీ బండి సంజయ్
-
భారీస్థాయిలో శోభాయమానంగా నిర్వహించేందుకు సన్నాహాలు
-
నగరానికి చేరుకున్న ఈశ్వరుడు, రాముడు, ఆంజనేయ విగ్రహాలు
కరీంనగర్‍టౌన్, వెలుగు: ఎనిమిదేళ్లుగా యేటా ఘనంగా నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్రకు బుధవారం నగరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ వైశ్య భవన్ వద్ద నుంచి ప్రారంభమై కరీంనగర్ నగర పురవీధుల గుండా సాగి రాత్రి 11 గంటల వరకు తిరిగి వైశ్య భవన్ వద్ద ముగుస్తుంది.
హిందూ ఏక్తా యాత్ర, హిందూ శంఖారావం పేరిట హిందువుల ప్రతినిధిగా బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా పేరు సాధించారు. ఈ ఏడాది నిర్వహించే ‘హిందూ యాత్ర’ ఓ రకంగా ఇటీవల భారీ మెజారిటీతో గెలిచిన బండి సంజయ్ కుమార్ విజయోత్సవ యాత్ర గా మారనుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ తెలిపారు.
ఈ యాత్ర కోసం ఈశ్వరుడు, రాముడు, ఆంజనేయ విగ్రహాలు నగరానికి మంగళవారం చేరుకున్నాయి. నగరంలోని అన్ని చౌరస్తాలు కాషాయ పతాకాలతో రెపరెపలాడుతున్నాయి. యాత్రలో పాల్గొనే వేలాది మంది ప్రజల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ మంచినీరు పంపిణీ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చర్యలు చేపట్టారు.
ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ అధ్యక్షుడు బాస
ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు మంగళవారం పరిశీలించారు. వారి వెంట బేతి మహేందర్ రెడ్డి, దుబాల శ్రీనివాస్, బోయినపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఉన్నారు.