ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ బోణీ

 ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ బోణీ

దోహా: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బోణీ చేశాడు. శుక్రవారం జరిగిన నాలుగు రౌండ్లలో అర్జున్‌‌‌‌ విజయాలు సాధించాడు. తొలి రౌండ్‌‌‌‌లో 53 ఎత్తులతో మార్కా మాటేరియాపై, రెండో రౌండ్‌‌‌‌లో 56 ఎత్తులతో చంద్ర సాందిపన్‌‌‌‌పై, మూడో రౌండ్‌‌‌‌లో 76 ఎత్తులతో బాయ్‌‌‌‌ జిన్షిపై, నాలుగో రౌండ్​లో 35 ఎత్తులతో హోకబాయన్​పై నెగ్గాడు.

 వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు.  రొడ్రిగ్‌‌‌‌ షాన్‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌ 61 ఎత్తుల వద్ద ముగిసింది. రెండో రౌండ్‌‌‌‌లో 33 ఎత్తుల వద్ద సెర్గి డ్రాగోల్‌‌‌‌పై, మూడో రౌండ్‌‌‌‌లో 36 ఎత్తుల వద్ద నికితా పెట్రోవ్‌‌‌‌పై నెగ్గాడు. తొలి గేమ్‌‌‌‌లో 52 ఎత్తుల వద్ద మాక్సిమ్‌‌‌‌ సారుక్‌‌‌‌పై నెగ్గిన ప్రజ్ఞానంద తర్వాతి రెండు గేమ్‌‌‌‌లను డ్రాగా ముగించాడు. విమెన్స్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో తెలుగు గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ కోనేరు హంపి 67 ఎత్తుల వద్ద ఇరెన్‌‌‌‌ లాస్టింగర్‌‌‌‌పై గెలవగా, తోఖిర్జోనోవా గులుబేగిమ్‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌ను 58 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. మూడో గేమ్‌‌‌‌ను డ్రా చేసుకుంది. గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ద్రోణవల్లి హారిక మూడు గేమ్‌‌‌‌ల్లోనూ నెగ్గింది.