డాక్టర్‌కు కరోనా పేషెంట్ గిఫ్ట్.. వెలకట్టలేని బహుమతి అందించిన రైతు

డాక్టర్‌కు కరోనా పేషెంట్ గిఫ్ట్.. వెలకట్టలేని బహుమతి అందించిన రైతు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలకు చెందిన డాక్టర్లు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వైరస్ సోకి ఆరోగ్యం మరింత క్షీణించిన బాధితుల్ని సైతం డాక్టర్లు తమ వైద్యంతో ప్రాణం పోస్తున్నారు.

తాజాగా ఓ మహిళా వైద్యురాలు కరోనా వైరస్ సోకిన రైతుకి ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు కాపాడింది. అందుకు కృతజ్ఞతలు చెబుతూ సదరు రైతు ఇచ్చిన బహుమతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూణేకి చెందిన డాక్టర్ ఊర్వీ శుక్లా కరోనా బాధితులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే కరోనా సోకిన ఓ రైతు ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయులో ఉంచి చికిత్స చేశారు. 15రోజుల తరువాత ఆ రైతుకి కరోనా తగ్గింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

అయితే ప్రాణా పాయ స్థితిలో ఉన్న డాక్టర్లకు కృతజ్ఞతగా రైతు ఏదో చేయాలనుకున్నాడు. తన తాహతకు తగ్గట్లుగా తానే స్వయంగా పండించిన పంట బియ్యాన్ని డాక్టర్ ఊర్వీ శుక్లాకు అందించాడు.

దీంతో రైతు తమపై చూపించిన అభిమానానికి పొంగిపోయిన డాక్టర్ ఊర్వీ..తనకు అందించిన బియ్యం కవర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.