స్మార్ట్ గా ప్రచారం..ఆన్ లైన్లో ఎన్నికల ప్రచారం

స్మార్ట్ గా ప్రచారం..ఆన్ లైన్లో ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారం రోజుకో కొత్త పోకడలో పోతోంది. ఎన్నికలంటే కార్యకర్తల నానా హంగామా, పోస్టర్లు , గోడలపై రాతలు,భారీగా జనాల ప్రచారాలు, డప్పులు చప్పుళ్లు, డ్యాన్సు లు, అభ్యర్థుల సుదీర్ఘ స్పీచ్ లుఇవే ఇప్పటి వరకు ప్రజల మదిలో ఉండేవి.కానీ మారుతున్న టెక్నాలజీ ఎన్నికల ప్రచారంలోనూ కొత్తదనాన్ని తీసుకొచ్ చాయి.ప్రస్తుతం ఎన్నికల నిబంధనలతో ఈ పరిస్థితులు దాదాపు మారాయి. ప్రత్యక్ష ప్రచారాలకు వెళ్లేవారి కన్నా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేవారి సంఖ్య పెరిగింది .గతంలో పార్టీ ఎన్ని కల కార్యాలయాలు ప్రారంభిం చగా ప్రస్తుతం ‘డిజిటల్ క్యాంపెయిన్‍’ల పేరిట స్పె షల్‍ టీం లను ఏర్పాటు చేసుకుంటు న్నారు. ట్వి ట్టర్ లో ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి? ఫేస్ బుక్ లో లైక్ లను ఎలా పొందాలి? ఇన్ స్టాగ్రాం లో ఎన్నికల క్యాంపెయిన్‍ తాజా సమాచారాన్ని , నెటిజన్లను ఆకట్టుకునే విధంగా ఎలా అప్ లోడ్‍ చేయాలి? ఇలా అనేక సాం కేతిక పరిజ్ఙా నం ఉన్న ఎక్స్ పర్ట్ లకు డిమాండ్‍ ఎక్కువగా ఉంది. సెర్చిం జన్ లో గూగుల్ దే పెద్దన్న పాత్ర. గూగుల్ లో ఏదైనా కీ వర్డ్​ను టైప్ చేసి ఎంటర్‍ కొడితే వెంటనే మొదటి పేజీలోనే ఆయా వివరాలు కనిపించేలా చేయడంలో సెర్చింజన్‍ ఆప్టిమైజేషన్‍(ఎస్‍ఈఓ)లకు విపరితంగా డిమాండ్‍ పెరుగుతుంది . ముఖ్యం గా ఎన్ని కల వేళ వీరికి చేతినిండా పని దొరుకుతుంది . అలాగే చూడగానే ఆకట్టుకునేలా రాసే క్రియేటివిటీ రైటర్లకు, యానిమేషన్‍ ప్రోగ్రాం నిపుణులు, డిజైనర్లకు ఎన్ని కల ప్రచారం జరిగినన్నీరోజులు డబుల్‍ ఇన్‍కం గ్యారంటీ. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, పార్టీలు తరఫున కన్సల్టెన్సీ లను మాట్లాడుకొని తమ తరఫున సోషల్ మీడియాలో, సెర్చింజన్ లో నెటిజన్లకు వివరాలు అందుబాటులో ఉండేలాచూసుకుంటు న్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై ఆరోపణాస్త్రా లు ఎక్కుపెట్టడంతో ‘డిజిటల్‌‌‌‌’ ఎన్నికల యుద్ధం రంజుగా సాగుతోంది . ముఖ్యం గా ప్రత్యర్థి పార్టీలను,అభ్యర్థులను విమర్శించేలా మీమ్స్‌‌‌‌(బొమ్మల-తో కూడిన యానిమేషన్‍) సిద్ధం చేసి సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌ చేయడంలో తలమునకలై ఉన్నారు.

ఈ నాలుగే కీలకం…

గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలను విశ్లేషి స్తూ డిజిటల్ కీ వర్డ్ లను రూపొంది స్తూ వాటిని సోషల్ మీడియా లో వివిధ వేదికలలో ప్రచారం పొందేలా పోస్టిం గ్ లు పెడుతున్నారు. గత ఫలితాలను పరిశీలించి తమ పార్టీ విజయావకాశాలు దెబ్బతీసిన వర్గాలపై,ప్రాంతాలపై దృష్టి సారించి అక్కడి ప్రజలపై ప్రభావం చూపే భౌగోళిక‍ అంశాలను అధ్యయనం చేసి ప్రచారంలో ఉండేట్లు చూడటం కూడా డిజిటల్‍ క్యాంపెయిన్ లో భాగమైంది .ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ఇన్‌‌‌స్టా గ్రామ్‌‌‌‌, యూట్యూబ్‌ ,వాట్సాప్‌‌‌‌ వేదికలను తమ ప్రచారం కోసం విపరీతంగా వాడుకుంటు న్నాయి. తమ అభ్యర్థికి సంబంధించి తాము ఇచ్చే అంశాలనుపోస్ట్‌‌‌‌ చేస్తే.. ఒక్కో ఐటమ్‌‌‌‌, వీడియోకు ప్రత్యేకంగా ధరను నిర్ణయించి ఇచ్చేలా వీళ్లతోఇప్పటి కే ఒప్పం దాలు చేసుకున్నారు.