3 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

3 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా.. నాగాలాండ్, మేఘాలయాలో ఫిబ్రవరి 27న ఎన్నిక నిర్వహించనున్నారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. 

                        త్రిపుర

అసెంబ్లీ స్థానాలు        60
నోటిఫికేషన్            జనవరి 21
పోలింగ్                  ఫిబ్రవరి 16
కౌంటింగ్                మార్చ్ 02

                    నాగాలాండ్ 
అసెంబ్లీ స్థానాలు        60  
నోటిఫికేషన్              జనవరి 31
పోలింగ్                    ఫిబ్రవరి 27
కౌంటింగ్                 మార్చ్ 02

                   మేఘాలయ 
అసెంబ్లీ స్థానాలు        60 
నోటిఫికేషన్            జనవరి 31
పోలింగ్                  ఫిబ్రవరి 27
కౌంటింగ్               మార్చ్ 02

నాగాలాండ్ అసెంబ్లీ కాల పరిమితి మార్చ్ 12న ముగుస్తుండగా.. మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ గడువు మార్చ్ 15, 22న పూర్తికానుంది. మార్చ్ నెలఖరులోగా ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.