
- 2 నెల్లో 808 పార్టీల్ని డీ-లిస్ట్ చేసిన ఈసీ
న్యూఢిల్లీ: రూల్స్ ఉల్లంఘించినందుకు 474 రిజిస్టరై గుర్తింపులేని రాజకీయ పార్టీలను (ఆర్‌యూపీపీ) ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం డీ-లిస్ట్ చేసింది. గత ఆరేండ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఈ తొలగింపునకు ప్రధాన కారణం. డీ-లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా, మొదటి దశలో ఆగస్టు 9న 334 గుర్తింపులేని పార్టీలను తొలగించిన ఎన్నికల సంఘం, రెండో దశలో సెప్టెంబర్ 18న మరో 474 పార్టీలను డీ-లిస్ట్ చేసింది.
దీంతో గత రెండు నెలల్లో మొత్తం 808 గుర్తింపులేని పార్టీలు తొలగించినట్టైంది. డీ-లిస్టింగ్ తర్వాత 2,046 పార్టీలు మిగిలాయి. ఇవి కాకుండా దేశంలో గుర్తింపు పొందిన ఆరు జాతీయ పార్టీలు. 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.