Pakistan Elections 2024: రీపోలింగ్కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిర్ణయం..

Pakistan Elections 2024: రీపోలింగ్కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిర్ణయం..

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఫలితాల్లో ఇప్పటివరకు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మరోవైపు పలు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్  మెటీరియల్ను లాక్కోవడం, ధ్వంసం చేయడం వంటి ఫిర్యాదుల అందాయి.  ఫిర్యాదులను విచారించిన తర్వాత దేశవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నికలకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ( ECP) ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15న ఆయా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. 

పాకిస్తాన్ స్థానిక మీడియా ప్రకారం.. దేశవ్యాప్తంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రిని లాక్కోవడం, ధ్వంసం చేయడం వంటి సంఘటనలు జరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఎన్నికల సంఘం స్పందించింది. పోలింగ్ ప్రక్రియను వాయిదా వేయాలని స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది. రీపోలింగ్ కు ఆదేశించిన పోలింగ్ స్టేషన్ల జాబితాను పాకిస్తాన్ ఎన్నికల సంఘంవిడుదల చేసింది. 
పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంక్వా నియోజకవర్గాల్లోని పలు  పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్ జరిగిందని ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు ఆరోపిస్తూ.. అటు పాకిస్తాన్, యూఎస్ కూడా ఆందోళనలు నిర్వహించారు.  ఎన్నికల సందర్భంగా ఆర్మీ రిగ్గింగ్ కు సహకరించిందని ఆర ఆరోపించారు. ఈ క్రమంలో పలు చోట్ల పోలింగ్ మెటీరియల్ అపహరణ, ధ్వంసం చేసిన ఘటనల్లో ఎన్నికల కమిషన్ కు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో  కొన్ని నియోజకవర్గాల్లో రీపోలింగ్ కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదేశించింది. 

పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలలో ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు.మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగగా .. ఇప్పటవరకు విడుదలైన ఫలితాలలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా 101స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయడానికి మొగ్గుచూపుతుంది. ఇప్పటివరకు 69 సీట్లతో రెండవ అత్యధికత స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 51 స్థానాలతో మూడోస్థానంలో ఉంది. 

మిగిలిన 22 సీట్లు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ ఎన్ లేదా పీపీపీకి ఆధిక్యం ఇవ్వడానికి సరిపోవు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 133. ఈ సంఖ్యకు దగ్గరలో ఏ పార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరిగా మారింది.