జనరల్​..డీఏ విడుదలకు ఈసీ ఓకే

జనరల్​..డీఏ విడుదలకు ఈసీ ఓకే
  •  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల కమిషన్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మొత్తం మూడు డీఏలు పెండింగ్‌‌‌‌లో ఉండగా.. ఒకటి విడుదల చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీకి తమ వినతిని పంపాయి. అయితే పోలింగ్ కంటే ముందు డీఏ చెల్లింపునకు ఈసీ అంగీకరించలేదు. 

పెండింగ్ డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యమైందని, ఎన్నికలకు ముందే ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో డీఏ చెల్లింపు విధానాల గురించీ అడిగింది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ ఓకే చెప్పింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. 2022 జులై ఒకటో తేదీ నుంచి మూడు డీఏలు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఖజానాలో తగినన్ని నిధులు లేవని, డీఏల చెల్లింపు కాస్త ఆలస్యం అయ్యే చాన్స్ ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.