దేశంలో 2293 రాజకీయ పార్టీలు!

దేశంలో 2293 రాజకీయ పార్టీలు!

న్యూఢిల్లీ: భరోసా, సబ్సీ బడీ, రాష్ట్రీయ సాఫ్ నీతి… ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ ద్ద ఈమధ్య రిజిస్టర్ అయిన కొత్త పార్టీల పేర్లివి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి నుం చి మార్చి 9 వరకు ఏకంగా 149 కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో 58 కొత్త పార్టీలు ఈసీ వద్ద పేర్లు నమోదు చేసు కున్నాయి. ఇలా చిన్నా పెద్దా పార్టీలన్నీ కలిసి ఇండియాలో 2,293 పార్టీలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే వీటిలో గుర్తింపు పొందిన పార్టీలు మాత్రం 66 మాత్రమేనని ఈసీ తెలిపింది. గుర్తింపు పొం దినవాటిలో 7 జాతీయ పార్టీలుకాగా, 59 ప్రాంతీయ పార్టీలేనని చెప్పింది.

గుర్తింపు పొందాలంటే?

ఈసీఐ రూల్స్ ప్రకారం ఏదైనా పార్టీ గుర్తింపు పొందాలంటే అంతకుముందు ఎన్నికల్లో నిర్ణీత మొత్తంలో ఓట్లు గానీ, సీట్లు(అసెంబ్లీ , లోక్ సభ) గానీ గెల్చుకోవాలి. ఈ రూల్ కారణంగా రిజిస్టర్ అయిన పార్టీలన్నీ గుర్తింపు పొందలేకపోతున్నాయి. ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఓట్లు రాబట్టుకోలేక కొన్ని, అసలు ఎన్నికల జోలికే వెళ్లకుండా మరికొన్ని ఈసీ గుర్తింపుకు నోచుకోలేదు. కొన్ని పార్టీలకైతే అసలు గుర్తింపు చిహ్నమే లేదు. ఇంకొన్ని ఉనికిలోనే లేవు. అయినప్పటికీ ప్రతీ ఎన్నికల సమయంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని ఏళ్ల తరబడి ఎన్నికల జోలికే వెళ్లడంలేదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. పోటీ చే యనపుడు పార్టీ పెట్టడం ఎందుకనే అనుమానం వచ్చిందా..ఈసీ అధికారులకు కూడా ఇదే సందేహం వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలకు కల్పించిన ఆర్థిక వెసులుబాటును ఇలా ఊరూపేరూ లేని పార్టీలు దుర్విని యోగం చే స్తున్నాయోమోననే అనుమానంతో 225 పార్టీల కార్యకలాపాలపై కన్నేసి ఉంచాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ను ఈసీ కోరింది.

బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు పార్టీల పేరును ఉపయోగించుకుంటున్నాయా అని కూడా ఈసీ అనుమానిస్తోంది. ఇదంతా ఎందుకు ఎన్నికల్లో పోటీ చే యని పార్టీల రిజిస్ట్రేషన్ ను తొలగించవచ్చు కదా అంటే.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయడం, రూల్స్ ప్రకారం వాటికి గుర్తింపునివ్వడం తప్ప రిజిస్ట్రేషన్ తొలగించే అధికారం ఈసీకి లేదని అధికారులు చెబుతున్నారు.