
పత్రికా ప్రకటనలపై ఈసీ ఆంక్షలు
న్యూఢిల్లీ: ఈసీ స్క్రీనింగ్ కమిటీ ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ కు 48 గంటలముందు పత్రికల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ప్రచురించ కూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో పాటు బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆదేశాలు జారీచేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచురిస్తున్న ప్రకటనలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ మసక బారిపోతోందని తెలిపింది. సమయాభావం వల్ల చర్యలు కూడా తీసుకోలేకపోతున్నామని తెలిపింది. ప్రకటనలతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే ఎలక్ట్రానిక్ మీడియాపై ఉన్న నిషేధాన్ని ప్రింట్ మీడియాకు కూడా విస్తరిస్తున్నట్లు చెప్పింది.