బిగ్ బ్రేకింగ్: డీజీపీ అంజనీకుమార్ పై వేటు.. రేవంత్ రెడ్డిని కలిసినందుకే..

బిగ్ బ్రేకింగ్: డీజీపీ అంజనీకుమార్ పై వేటు.. రేవంత్ రెడ్డిని కలిసినందుకే..

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై వేటు.. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండగా.. ఇంకా కోడ్ ముగియకుండానే.. తెలంగాణలో ఏ పార్టీ గెలిచింది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అని అధికారికంగా ప్రకటించక ముందే.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అభినందనలు తెలపటం.. అతని ఇంటి దగ్గర భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించటం వంటి పనులు చేయటంతో.. డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఎన్నికల సంఘం.మరో ఇద్దరు అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఈసీ.   

ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల సంఘం తన నివేదిక గవర్నర్ కు అందజేస్తుంది. ఈసీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానిస్తారు గవర్నర్. అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తారు. అందుకు భిన్నంగా ట్రెండ్స్ కంటిన్యూ అవుతున్న సమయంలోనే.. అధికారికంగా గెలుపోటములను ప్రకటించకముందే.. ఓ పార్టీ అధ్యక్షుని ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేయటాన్ని తప్పుబట్టింది ఎన్నికల సంఘం..