టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక

టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక
  •     రెండోసారి అధ్యక్షుడిగా గడియారం శ్రీహరి 

మంచిర్యాల, వెలుగు: టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా గడియారం శ్రీహరితో పాటు ఆయన ప్యానల్​రెండోసారి ఎన్నికయ్యింది. సోమవారం మంచిర్యాలలోని టీఎన్జీవోస్ హాల్​లో ఎన్నికల అధికారి సంద అశోక్​ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేట్​ ప్రెసిడెంట్​గా శ్రీపతి బాపు, వైస్​ ప్రెసిడెంట్లుగా కూర్మాచలం శ్రీనివాస్, జాడి రాం​కుమార్, తంగళ్లపల్లి తిరుపతి, కె.కేజియారాణి, సెక్రటరీగా భూముల రామ్మోహన్, జాయింట్​ సెక్రటరీలుగా ఆర్.రవికిరణ్, సురిమల్ల ఏసయ్య, బి.సురేందర్, ఎ.సునీత ఎన్నికయ్యారు.

ట్రెజరర్​గా ఎ.సతీశ్​ కుమార్, ఆర్గనైజింగ్​సెక్రటరీగా బి.శ్రావణ్​కుమార్, పబ్లిసిటీ సెక్రటరీగా ఎండీ.యూసుఫ్, ఈసీ మెంబర్లుగా తిరుమలేశ్వర్​, మొహ్మిన్​ అహ్మద్​, కుమారస్వామి, బి.పద్మజను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరితో పాటు కమిటీ సభ్యులను టీఎన్జీవోలు సన్మానించారు.