పీడీఎస్యూ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

పీడీఎస్యూ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక
  •   అధ్యక్షుడిగా మొగిలి వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్ యూ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మూడవరోజు జరిగిన సంస్థాగత కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 29 మందితో ఎన్నుకున్నారు. స్టేట్  ప్రెసిడెంట్​గా ఎం. వెంకట్ రెడ్డి (రాష్ట్ర సెంటర్), ప్రధాన కార్యదర్శి ఏ. సాంబ (రాష్ట్ర సెంటర్)లతో పాటు సభ్యులను  ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకట్ రెడ్డి, ఎ. సాంబ మాట్లాడుతూ..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. నూతన విద్యావిధానం పేరుతో విద్యను కాషాయీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, విద్య ప్రైవేట్‌‌, కార్పొరేటీకరణను నిలిపివేయాలన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అందరికీ ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు.