భారీ బందోబస్తు నడుమ తుక్కుగుడా మున్సిపాలిటీ ఎన్నిక

భారీ బందోబస్తు నడుమ తుక్కుగుడా మున్సిపాలిటీ ఎన్నిక

రంగారెడ్డి జిల్లా: భారీ బందోబస్తు నడుమ తుక్కుగూడ మున్సిపల్ కోఆప్సన్ ఎన్నిక జరిగింది. డైరెక్టుగా వార్డుల్లో బీజేపీ గెలుపొందగా.. ఎక్స్ అఫీషియో సభ్యుల ద్వారా టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని గెలుచుకుంది.  తుక్కుగుడా మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా..  9 స్థానాల్లో బీజేపీ, ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా.. బీజేపీ రెబల్ 1 చోట గెలుపొందారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెబల్ అభ్యర్థిని టీఆర్ఎస్ లో చేర్చుకుంది. అంతేకాదు  టీఆర్ఎస్ ఎక్స్ ఆఫీసీయో సభ్యులు 1.మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, 2.ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, 3.ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, 4. ఎమ్మెల్సీ నాయిని నర్సింహా రెడ్డి, 5.కేశవరావు ల ఓట్లు నమోదు చేసుకోగా, బీజేపీ తరపున ఎక్స్ ఆఫీసీయో సభ్యుడిగా ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు నమోదు చేసుకొని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఛైర్మెన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా కో ఆప్షన్ సభ్యులు నలుగురిని ఎన్నుకోవడం కోసం అధికార పార్టీ ఎత్తుగడ వేసింది. అయితే ఈ కో ఆప్షన్ ఎన్నికకు టీఆర్ఎస్ తరపున 1.మంత్రి సబితా ఇంద్ర రెడ్డి, 2.ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, 3.ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం నమోదు చేసుకోగా బీజేపీ తరపున ఎక్స్ ఆఫీసీయో ఎవరు నమోదు కాలేదు. దీంతో కో ఆప్షన్ ఎన్నికల ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు 6గురు, ఎక్స్ ఆఫీసీయో సభ్యులు ఒకరు, మంత్రి సబితా ఇంద్ర రెడ్డి, 2.ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, 3.ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, హాజరయ్యారు. కాగా వీరు 9 మంది, బీజేపీ సభ్యులు 9 మంది. ఇరు పార్టీల బలాబలాలు సమం అయ్యాయి. ఎవరి అభ్యర్థులకు వారు ఓట్లేశారు. ఓట్లు సమానం వచ్చినందుకు ఫలితాలను ప్రకటించడం లేదని, ఈ ఎన్నికపై రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడానికి తీర్మానించినట్లు ఛైర్పర్సన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. కానీ ప్రభుత్వం ఎక్స్ ఆఫీసీయో సభ్యులను తీసుకువచ్చి అప్రజాస్వామికంగా కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని చూస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు. ఎక్స్ ఆఫీసీయో సభ్యులతో ఎన్నికలు నిర్వహించుకునే వీలును చట్టం కల్పించిందని టీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు జరిగాయి.