
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు తనిఖీల్లో 603 కోట్ల రూపాయల సొత్తును సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.214కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. రూ.96 కోట్ల విలువ చేసే మద్యం, రూ.34 కోట్ల విలువగల డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
రూ.179 కోట్ల రూపాయల విలువచేసే బంగారం, వెండి లాంటి వస్తువులు పట్టుకున్నారు. రూ.78 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం, చీరలు, మొబైల్స్ లాంటివి సీజ్ చేశారు. ఇదిలా ఉంటే సీ విజిల్ యాప్ ద్వారా 5183 కంప్లయింట్స్ వచ్చినట్లు సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సర్వీస్‌కు 20,670 కంప్లయింట్స్ రాగా 20,301 పరిష్కరించినట్లు తెలిపారు.