
వీకెండ్ వచ్చిందంటే నగర శివార్లు రేవ్ పార్టీలతో కళ కళలాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలనుసర్వీస్ అపార్ట్మెంట్ లలో కూడా నిర్వహిస్తున్నరు. తాజాగా కొండాపూర్ ఏరియాలో ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్ మెంట్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై శనివారం ( జులై 26) రాత్రి పోలీసులు కన్నేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకివెళ్తే....
నగర శివర్లలో అపార్ట్ మెంట్లలో వీకెండ్ పార్టీలు జరుగుతున్నాయి. ఇక అక్కడ సర్వీస్ అపార్ట్ మెంట్లలో గుట్టుగా డ్రగ్స్ వినియోగం.. అసాంఘిక కార్యకలాపాలు.. మహిళల డ్యాన్స్‌లు.. ఇలా ఒకటేమిటి.. రేవ్ పార్టీల పేరుతో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. శనివారం ( జులై 26) అర్దరాత్రి కొండాపూర్ ఏరియాలో ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్ మెంట్ కు ఏపీ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి వీకెండ్ ఎంజాయిమెంట్ లో మునిగిపోయారు. ఎంజాయిమెంట్ అంటే అట్టా.. ఇట్టా కాదు.. ఓ రేంజ్ లో మహిళలతో డ్యాన్స్‌లు.. డ్రగ్స్ వినియోగం.. ఒకటేమిటి ..మందు.. విందు.. ఇలా అన్నిటి ప్లాన్చేశారు.
రేవ్‌పార్టీ సమాచారం అందుకున్న తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బి టీం ఎస్సై సంధ్య బాలరాజు తన సిబ్బందితో కలిసి రేవ్ పార్టీ మూకలపై దాడి చేశారు. వీకెండ్ పార్టీ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుడ్డు చప్పుడు కాకుండా మారుపేరులతో మారు బ్యాంక్ అకౌంట్ లో .. ఆధార్ కార్డుల పేరును మార్చి డబ్బున్న సరాబులను తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళుతుంటారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఎస్టిఎఫ్ బి టీం శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు సిఐ సంధ్య తెలిపారు.
నిందితుల నుంచి 2.080 కేజీల గంజాయిని, 50 ఓజీ కుష్ గంజాయిని,11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్ ను, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ తో పాటు నాలుగు కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని.. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్, ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతా, తేజ ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.