గాంధీలో ట్రీట్మెంట్, ఫెసిలిటీస్ భేష్ : టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర

గాంధీలో ట్రీట్మెంట్, ఫెసిలిటీస్ భేష్ : టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర
  •     టీజీఎంఎస్​ఐడీసీ ఎండీ ఫణీంద్ర ప్రశంసలు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలో మౌలిక వసతులు, వైద్యసేవలు బాగున్నాయని తెలంగాణ వైద్య, విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీజీఎంఎస్‌ ఐడీసీ) ఎండీ ఫణీంద్ర సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన గాంధీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగం, ఫార్మసీ కౌంటర్, రేడియాలజీ, ఏఎంసీ, డైట్, జెరియాట్రిక్‌ వార్డు, ఫార్మసీ డిపార్ట్​ మెంట్, సీసీ కెమెరాల సర్వే లెన్స్‌ సెంటర్​ను పరిశీలించారు. ఆయా విభాగాలు, వార్డుల్లో అందిస్తున్న సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. 

మెహిదీపట్నం: రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ శనివారం రెడ్ హిల్స్ నిలోఫర్ హాస్పిటల్​ను సందర్శించారు. సీజనల్ వ్యాధులపై డాక్టర్లతో మాట్లాడారు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు వివిధ విభాగాలను పరిశీలించారు.