
దుబ్బాకలో కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. దుబ్బాకలో ఎలాగైన గెలవాలని చూస్తుందన్నారు. BJP అభ్యర్థి రఘునందన్ ఇంటితో పాటు ఆయన బంధువులు ఇళ్లపై పోలీస్ లు దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రజలు పోలీసులంటే అస్యహించుకునేలా చేసుకోవద్దని సూచించారు.
సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తెలుసుకుని TRS అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు డీకే అరుణ. మంత్రి హరీష్ వ్యవహార శైలి సరిగా లేదని..ఆయన ప్రజలకు అబద్దాలే చెబుతున్నారన్నారు. ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని..TRS పార్టీ కి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
పోలీసుల వెహికిళ్లతో.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లకు డబ్బులు పంపుతున్నారని ఆరోపించిన డీకే అరుణ… కేసీఆర్ ఆహంకారం తగ్గాలంటే దుబ్బాకలో బీజేపీ కి ఓటు వేసి గెలిపించి…చారిత్రాత్మక తీర్పునివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.