Electoral Bonds: 2019 నుంచి పార్టీల విరాళాలు..టాప్ డోనర్స్.. ఫుల్ డిటెయిల్స్

Electoral Bonds: 2019 నుంచి పార్టీల విరాళాలు..టాప్ డోనర్స్.. ఫుల్ డిటెయిల్స్

న్యూఢిల్లీ:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం (EC) గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే..ఈ డేటాలో సంచలన విషయాలు బయట కొచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల డేటా ప్రకారం.. 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్లు, వ్యక్తుల ద్వారా వివిధ రాజకీయ పార్టీలు రూ. 12వేల 769 కోట్లకు పైగా విరాళాలు అందుకున్నాయి. గత ఐదేళ్లో రాజకీయ పార్టీలు మొత్తం 20వేల 421 ఎలక్టోరల్ బాండ్లను క్యాష్ చేసుకున్నాయి. వీటిలో 12,207 బాండ్లు ఒక్కొక్కటి రూ. 1కోటి విలువ చేసేవి కాగా.. 5,366 బాండ్లు  ఒక్కొక్కటి రూ. 10 లక్షలు, 2,523 బాండ్లు ఒక్కొక్కటి రూ. లక్ష విలువ చేసేవి, 219 బాండ్లు రూ. 10వేల విలువ, 103 బాండ్లు రూ. 1000 విలువ చేసేవి ఉన్నాయి. 

ఎలక్టోరల్ బాండ్లు అత్యధికంగా పొందిన పార్టీగా బీజేపీ మొదటి స్థానంలో ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గరిష్టంగా రూ. 6,060.51 కోట్లు  విరాళాలు అందుకుంది. ఇది మొత్తం బాండ్ల విలువలో దాదాపు సగం. ఒక్కొక్కటి కోటిరూపాయలతో కూడిన 5,854 బాండ్లను, 10లక్షల రూపాయల విలువ చేసే 1,994 బాండ్లను బీజేపీ పార్టీ క్యాష్ చేసింది. 

తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను పొందిన రెండో పార్టీగా నిలిచింది. రూ.1609.50 కోట్ల విలులైన 3,275 ఎలక్టోరల్ బాండ్ లను రీడీమ్ చేసింది. వీటిలో 1,467 కోటిరూపాయల బాండ్లు ఉండగా.. 10 లక్షల రూపాయల 1,384 బాండ్లను క్యాష్ చేసింది టీఎంసీ.

EC  వెబ్ సైట్ లో అందుబాటులో డేటా ప్రకారం.. కాంగ్రెస్ రూ. 1,421.86కోట్ల విలువైన 3,141 ఎలక్టోరల్ బాండ్లను క్యాష్ చేసుకుంది. ఇందులో 1384 కోటి రూపాయల బాండ్లు ఉండగా.. 10 లక్షల విలువ చేసే బాండ్లు 958 ఉన్నాయి.   

పోల్ ప్యానల్ అప్ లోడ్ చేసిన డేటా ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారులలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, టోరెంట్ పవర్, భారతీ ఎయిర్ టెల్, డీఎల్ ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ మిట్టల్, ఎడెల్ వైస్, పీవీఆర్ , కెవెంటర్, సులా వైన్, వెల్స్పన్, సన్ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ లో రిజిస్టర్డ్ అడ్రస్ తో, రిలయన్స్ ఇండస్ట్రీస్ తో లింక్ లను కలిగి ఉన్న పెద్దగా తెలియని కంపెనీ Qwik సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్టోరల్ బాండ్లను ఉపయోగించి రాజకీయ పార్టీలు విరాళాలు ఇచ్చిన అతిపెద్ద దాతగా ఉంది. ఇది 2021-22, 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ. 410 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఈ కంపెనీ ఏ రిలయన్స్ సంస్థకు అనుంబంధ సంస్థ కాదని తెలిపింది. 

ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. Qwik  సప్లై ద్వారా ఎలక్టోర్ బాండ్ కొనుగోళ్లు , విరాళాలు రూ. 1368 కోట్లు. ఫ్యూచర్ గేమింగ్ , హోటల్ సర్వీసెస్, హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ,ఇన్ ఫ్రా  కంపెనీలు ద్వారా రూ. 966 కోట్ల విరాళాలు రాజకీయ పార్టీలకు అందాయి.