
న్యూఢిల్లీ: ఇండియాలో ఈ ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఏకంగా 1,267 శాతం వృద్ధి చెందాయి. శ్రీరామ్ ఫైనాన్స్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, గతేడాది జూన్‌లో 717 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది జూన్‌లో 9,804 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది మేతో పోలిస్తే మాత్రం ఒక శాతం గ్రోత్ మాత్రమే నమోదైంది.
డిమాండ్ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు పడ్డాయి. ఇదే టైమ్‌లో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయాలు 5శాతం పెరిగి 93,872 యూనిట్లకు చేరాయి. డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ సెక్టార్‌లో ట్రక్ రెంటల్స్ ఏడాది లెక్కన 5 శాతం పెరిగాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూన్‌లో 1.3శాతం పెరిగాయి. పెట్రోల్ వినియోగం 6.4శాతం పెరిగి 3.51 ఎంటీకి, డీజిల్ వినియోగం 1.2శాతం పెరిగి 8.08 ఎంటీకి చేరింది.