
హైదరాబాద్ సిటీ, వెలుగు: కరెంట్సమస్యలపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ నర్సింహులు ఆదేశించారు. విద్యుత్ సరఫరా సమస్యలపై అత్యధికంగా కాల్స్ నమోదవుతున్న హైదరాబాద్ సౌత్ సర్కిల్, సెంట్రల్ సర్కిల్ పరిధిలోని వివిధ ఆఫీసులను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తర్వాత ఇంజినీర్లతో మాట్లాడారు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్లే సరఫరా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో ఎస్ఈలు, డీఈలు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.