వరి నాట్ల జోరు..కరెంట్ కు ఫుల్ డిమాండ్

వరి నాట్ల జోరు..కరెంట్ కు ఫుల్ డిమాండ్
  • ప్రస్తుతం 24 లక్షల మోటర్లు నడుస్తున్నయ్‌..
  • 11 వేల మెగావాట్లు దాటిన డిమాండ్‌
  • క్రమంగా పుంజుకుంటున్నయూసేజ్
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో సాగు జోరందుకోవడంతో కరెంట్ వినియోగం పెరిగింది. చాన్నాళకు్ల విద్యుత్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 వేల మెగావాట్లు దాటింది. ప్రస్తుం 11 వేల మెగావాట్లకు పైగా నమోదవుతోంది. రానున్న రోజుల్లో అది 12 వేల మెగా వాట్లకు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు.ఏప్రిల్ లో డౌన్ గత ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుం చి విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకం తగ్గుముఖం పట్టింది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు అన్నీమూతపడడంతో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2న 10014 మెగావాట్లున్నవిద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 29 వరకు వచ్చే సరికి అత్యల్పం గా 6003 మెగావాట్లకు పడిపోయింది. ఎండలు భగ్గుమనే మే నెలలోనూ ఆరేడు వేల మెగావాట్ల మధ్యే కొనసాగింది. ఈనెల ప్రారంభం నుంచి కొంత వినియోగం పెరిగింది. ఈనెల 27న ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 10677 మెగావాట్ల డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం 11044 మెగావాట్లు నమోదైంది.
సాగు మొదలు కావడంతో
జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్షాలు పడడంతో క్రమంగా పంటలసాగు మొదలైంది. వర్షాధార పంటల సాగంతా  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలాఖరు వరకు పూర్తయ్యా యి. తాజాగా వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో కరెంటు వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే 12 లక్షకు పైగా ఎకరాల్లో వరినాట్లు సాగుతున్నాయి.మొన్నటిదాకా 8 వేల నుంచి 9 వేల మెగావాట్ల లోపే ఉన్న విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూలై 22 నాటికి 10205 మెగావాట్లుగా నమోదైంది. మంగళవారం 11వేల మెగావాట్లు దాటింది. లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కువర్షంసరిగ్గారాక వరినాట్లు పడలేదు. దీంతో అప్పుడు 7520 మెగావాట్లు మాత్రమే ఉండడం గమనార్హ్ . సాగు పెరగడమే ఇప్పుడుడిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరగడానికి కారణమని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు చెబుతున్నారు.

లక్షల మోటర్ల మోత
వరి సాగంతా బోరు బావుల కింద ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తు తం 24 లక్షల మోటార్లు నడుస్తు న్నాయి. రాష్ట్రంలో 41.76 లక్షల ఎకరాల్లో వరి సాగు సాగు చేయాలని టార్గెట్‌ పెట్టు కోగా..ఇప్పటిదాకా 30 శాతం వరకు నమోదైంది. తాజాగా వరి నాట్లు జోరందుకోవడంతోనాట్లు వేసేందుకు కరెంటు మోటార్ల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో పది రోజుల క్రితం 8 వేల మెగావాట్లు ఉన్న విద్యుత్‌ డిమాండ్‌ 2వేల మెగావాట్లు పెరిగింది.