వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని చీకట్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2001లో కేసీఆర్ ఉద్యమం చెయ్యకపోతే ప్రస్తుతం 24 గంటల కరెంట్ వచ్చేదికాదన్నారు. గుజరాత్లో విద్యుత్ సంక్షోభం వచ్చిందన్నారు.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్పష్టమైన గళాన్ని వినిపించింది కేసీఆర్ ఒక్కడేనని చెప్పారు. హన్మకొండలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నూతన క్యాలెండర్ ను మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఆయన ఆవిష్కరించారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటీకరిస్తున్నారని చెప్పారు. కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.