సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో భారీగా పెరిగిన ఎలక్ట్రానిక్ పర్మిట్లు

 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో భారీగా పెరిగిన ఎలక్ట్రానిక్ పర్మిట్లు

న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య వస్తువులను రవాణా చేయడానికి జారీ చేసే ఎలక్ట్రానిక్ పర్మిట్లు (ఈ–వే బిల్లులు) సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో 8.4 కోట్లకుపైగా పెరిగాయి. పండుగ సీజన్‌‌‌‌లో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయనడానికి ఇది సంకేతామని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఈ–వే బిల్లుల పెరుగుదలను గమనిస్తే  అక్టోబర్‌‌‌‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌‌‌‌లో జీఎస్టీ రాబడి వసూళ్ల వివరాలను నవంబర్ 1న ప్రకటిస్తారు. జీఎస్టీ రిటర్న్‌‌‌‌లను ప్రాసెస్ చేసే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్‌‌‌‌వర్క్  డేటా ప్రకారం సెప్టెంబర్‌‌‌‌లో 8.4 కోట్లకు పైగా ఈ–వే బిల్లులు వచ్చాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో రికార్డు స్థాయిలో రూ.1.69 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయింది. ప్రస్తుత ఏడాది మార్చిలో  ఈ–వే బిల్లుల జనరేషన్ విపరీతంగా ఉండటంతో ఏప్రిల్​ జీఎస్టీ కలెక్షన్లు విపరీతంగా పెరిగాయి. జూన్ నుండి మరింత పెరిగాయి. పండగ డిమాండే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.  జీఎస్టీ, ఈ–వే బిల్లుల పెరుగుదలను గమనిస్తే రిటైలర్లకు ఈసారి పండుగ డిమాండ్‌‌‌‌ చాలా బాగుంటుందని చెప్పవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్​ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అన్నారు.  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో మాన్యుఫాక్చరింగ్​ పీఎంఐ   డేటా కూడా ఆశించినస్థాయిలో ఉందన్నారు.