ఏపీ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీఎం తండాలో ఏనుగు విధ్యంసం సృష్టించింది. ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. రాత్రి పంటపొలాలను ధ్వంసం చేస్తుండడంతో అక్కడే ఉన్న రైతు కన్నా నాయక్.. గట్టిగా అరుస్తూ ఏనుగును తరిమే ప్రయత్నం చేశాడు.
దీంతో ఏనుగు రైతుపై ఒక్కసారిగా దాడిచేసింది. తీవ్రంగా గాయపరిచి కాలితో తొక్కడంతో కన్నా నాయక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఏనుగు దాడితో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఏనుగుల సమస్యను పరిష్కారించాలని కోరుకుంటున్నారు గ్రామస్తులు.