ఎలన్ మస్క్​ చేతికే ట్విటర్​

ఎలన్ మస్క్​ చేతికే ట్విటర్​

ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ అనుకున్నది సాధించారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. వాక్ స్వాతంత్ర్యం కోసం ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించారు. ముందస్తు ప్లాన్ లో భాగంగా రెండు వారాల క్రితమే ట్విట్టర్ లో 9.2 శాతం అత్యధిక వాటాను కొన్నారు ఎలాన్ మస్క్. ఇప్పుడు ట్విట్టర్ మొత్తాన్ని 44 బిలియన్ డాలర్లకు కొనేందుకు డీల్ చేసుకున్నారు. ఇప్పటికే ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను కొంటానని గతవారమే ప్రకటించారు ఎలన్ మస్క్.

ఎలన్ మస్క్ తో కొనుగోలు ఒప్పందంతో ట్విట్టర్ షేరు సోమవారం 3 శాతం పెరిగింది. ట్విట్టర్ కొనుగోలు నిధులను బ్యాంకులతో మస్క్ సమకూర్చుకున్నట్లు కథనాలు రాసింది ద వాల్ స్ట్రీట్ జర్నల్. ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడంతో... ట్విట్టర్ కో CEO బ్రెట్ టేలర్ స్పందించారు. ఎలన్ ట్విట్టర్ కొనుగోలు చేయడం స్టాక్ హోల్డర్లకు ఉత్తమ మార్గం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.