ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ను తొలగించిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ను తొలగించిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చి రాగానే మస్క్ యాక్షన్ ప్రారంభించాడు. ట్విట్టర్ సీఈవో గా ఉన్న పరాగ్ అగర్వాల్ ను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనతో పాటు ఇతర కార్యనిర్వాహక సభ్యులను కూడా తొలగించారు. పరాగ్ అగర్వాల్ గత పదేళ్లుగా ట్విట్టర్ లో పనిచేస్తున్నారు. గతంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఉన్న ఆయన.. గతేడాది నవంబర్ నెలలో ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. 

ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను తొలగించడంలో... లీగల్ పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం అధిపతిగా విజయ గద్దె కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆమెను కూడా విధుల నుంచి ఎలన్ మస్క్ తప్పించడం చర్చనీయాంశంగా మారింది. మస్క్ తాజా నిర్ణయంతో ఉద్యోగులు, వాటాదారుల్లో అనిశ్చితి నెలకొంది. రానున్న రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరు నెలల హైడ్రామా తర్వాత ప్రపంచంలోని ఎలాన్ మస్క్ ట్విటర్‌ కొనుగోలును ఆమోదించారు. ట్విటర్‌ కొత్త చీఫ్ ఇన్‌చార్జ్‌గా గురువారం ప్రకటించుకున్నారు. అనంతరం శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.