ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకిచ్చిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకిచ్చిన ఎలాన్ మస్క్

న్యూయార్క్ : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు. కంపెనీలో కొనసాగుతానని హామీ ఇవ్వడంతో పాటు టైంతో పని లేకుండా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లేనిపక్షంలో 3 నెలల జీతం తీసుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ ఉద్యోగులకు సింగిల్ క్వశ్చన్ తో కూడిన ఫాంను ఈ మెయిల్ ద్వారా పంపారు. గురువారం సాయంత్రం 5 గంటల్లోపు తాను పంపిన ఫాం ఫిల్ చేసి పంపాలని గడువు విధించారు. కంపెనీలో అసాధారణ ప్రతిభావంతులకు మాత్రమే అవకాశం ఉంటుందని మస్క్ ఈ మెయిల్ లో స్పష్టంచేశారు. అయితే దీనిపై ట్విట్టర్ యాజమాన్యం స్పందించలేదు.

మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో "మీరు ట్విట్టర్ లో కొనసాగాలనుకుంటున్నారా"? అన్న ప్రశ్న పొందుపరిచారు. అయితే దానికి సమాధానంగా "ఎస్" అనే ఆప్షన్ మాత్రమే ఇవ్వడం విశేషం. మస్క్ ఈమెయిల్ చూసి చాలా మంది ఉద్యోగులు అయోమయానికి గురయ్యారని, వారిలో కొందరు ఎలా స్పందించాలన్న దానిపై లాయర్లను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. మస్క్ నిర్ణయం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.