ట్విట్టర్ బోర్డులో చేరబోనన్న ఎలన్ మస్క్

ట్విట్టర్ బోర్డులో చేరబోనన్న ఎలన్ మస్క్

వాషింగ్టన్ డీసీ: అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ బోర్డులో జాయిన్ కావడం లేదు. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తెలిపారు. ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సభ్యుల్లో మస్క్ చేరడం లేదని పరాగ్ అగర్వాల్ చెప్పారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఓ సభ్యుడిగా మస్క్ ను నియమించి వారం కూడా కాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే సంస్థ ఎదుగుదలలో, నిర్మాణంలో మస్క్ పాత్ర కీలకంగా ఉంటుందని పరాగ్ అన్నారు. బోర్డులో తాను భాగమవ్వాలని అనుకోవడం లేదని ఎలన్ తమకు చెప్పాడన్నారు. అయితే ట్విట్టర్ కు అతిపెద్ద షేర్ హోల్డర్లలో ఒకరైన ఆయన ఇచ్చే సూచనలను స్వీకరించడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఇకపోతే, ట్విట్టర్ కు బిగ్ షేర్ హోల్డర్ గా ఉన్న మస్క్ కు.. ఆ సంస్థలో 9.2 శాతం వాటా ఉంది. 

కాగా, ట్విట్టర్‌ తన ఉనికిని కోల్పోతున్నట్లుందని ఎలన్ మస్క్ రీసెంట్ గా  చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ట్విట్టర్ బ్లూ టిక్ యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను తక్కువగా వాడుతున్నారని.. వీళ్లు మరింత ఎక్కువగా ట్విట్టర్ వాడేలా చేసేందుకు సలహాలు కావాలని కోరాడు. ‘90 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న స్విఫ్ట్ టేలర్ మూడు నెలలుగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. 114 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జస్టిన్ బీబర్ ఈ ఏడాది ఒకే ట్వీట్ చేశాడు. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడు మాత్రమే ట్వీట్ చేస్తున్నారు. అందుకే టాప్ యూజర్లు ఎక్కువగా ట్విట్టర్ వాడేలా చర్యలు తీసుకుంటాను’ ఎలన్ మస్క్ చెప్పాడు.

మరిన్ని వార్తల కోసం:

ట్విట్టర్​ నుంచి ఎడిట్​ ఫీచర్​

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు