ట్విట్టర్ లో తమ ప్రకటనల్ని నిలిపేసిన యాపిల్

ట్విట్టర్ లో తమ ప్రకటనల్ని నిలిపేసిన యాపిల్

ఎలన్ మస్క్ పెద్ద సాహసమే చేస్తున్నాడు. టెక్ దిగ్గజం యాపిల్ తో పోటీకి సిద్ధం అంటున్నాడు. ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటినుంచి మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలతో టెక్ సంస్థల్లో గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. తన నిర్ణయాలను పలు టెక్ కంపెనీలు విమర్శిస్తున్నాయి. అయితే, తాజాగా యాపిల్ కంపెనీ ట్విట్టర్ లో తమ ప్రకటనల్ని (యాడ్స్) నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా యాప్ స్టోర్ నుంచి కూడా ట్విట్టర్ ని తొలగిస్తున్నట్టు మస్క్ కు సూచించింది. దీనిపై స్పందించిన మస్క్ ట్విట్టర్ లో యాపిల్ కంపెనీని ప్రశ్నించాడు. యాపిల్ తీసుకున్న నిర్ణయాలకు కారణాలు చెప్పాలని ట్వీట్లు పెట్టాడు. ఈ దాడి వల్ల తన టెస్లా కంపెనీపై ప్రభావం చూపిస్తుందని అంటున్నాడు.

ట్విట్టర్ లో ప్రకటనల కోసం యాపిల్ సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లపైనే ఖర్చు చేస్తోంది. యాడ్స్ ద్వారా ట్విట్టర్ కు ఎక్కువ ఆదాయం యాపిల్ నుంచే వస్తుంది. యాపిల్ ట్విట్టర్ తో సంప్రదింపులకోసం ఒక టీంనే నియమించింది. అయితే, బ్లూ టిక్ సబ్ర్కిప్షన్, కంటెంట్ మాడరేషన్, ఉద్యోగాల కోత, ఆఫీస్ ల మూసివేత, వాక్ స్వేచ్ఛ అంటూ మస్క్ ట్విట్టర్ లో చాలా మార్పులు తీసుకొచ్చాడు. వాక్ స్వేచ్ఛను యాపిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మస్క్ ఆరోపిస్తున్నాడు. అందుకే యాపిల్ ఈ నిర్ణయాలు తీసుకుంటుంది అంటున్నాడు. అయితే, యాపిల్ మాత్రం ‘ఇతరులపై ద్వేషాన్ని వ్యక్తపరిచే ప్లాట్ ఫామ్ గా ట్విట్టర్ మారిందని, అది తమ ప్రైవసీ, పాలసీలకు విరుద్ధమని, అందుకే ట్విట్టర్ ను వ్యతిరేకిస్తున్నట్టు’ చెప్తుంది. యాప్ స్టోర్ ల నుంచి ట్విట్టర్ ను తొలగిస్తే ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల యూజర్లని ట్విట్టర్ కోల్పోతుంది.