ప్రపంచ కుబేరునిగా మస్క్.. ఉన్నది రెండు రోజులే

ప్రపంచ కుబేరునిగా మస్క్.. ఉన్నది రెండు రోజులే

ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరునిగా అవతరించి రెండు రోజులుగా కాలేదు.. అంతలోనే 1.91 బిలియన్ల లాస్ వచ్చి నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. 5 శాతం టెస్లా షేర్లు కోల్పోవడంతో మస్క్ అగ్ర స్థానాన్ని కోల్పోయాడు. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ యొక్క CEO అయిన ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ తిరిగి నెంబర్ వన్ పొజిషన్ లోకి చేరుకున్నాడు. టెస్లా షేర్ల విలువ వేగంగా పడిపోవడంతో మస్క్ సంపద 1.9 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ప్రస్తుతం మస్క్ 184 బిలియన్ డాలర్ సంపదతో రెండో స్థానంలో, ఆర్నాల్ట్ 186 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 

ఫిబ్రవరి 28న మస్క్ ప్రపంచ కుబేరునిగా అవతరించాడు. ఆ రోజు టెస్లా షేర్లు పెరగడంతో మస్క్ ఆస్తి 187.1 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది నవంబర్‌ -డిసెంబర్‌ మధ్యలో మస్క్‌ ఆస్తుల విలువ ఏకంగా 200 బిలియన్‌ డాలర్లు పతనమైంది. ఈ క్రమంలో చరిత్రలోనే అత్యంత భారీగా సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’  కూడా ప్రకటించింది.